డిప్యూటీ CMతో బాలినేని భేటీ

ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో జనసేన పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, వివిధ రాజకీయ అంశాలపై సమాలోచనలు చేయడం జరిగిందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.