విద్యార్థులకు పరీక్ష ప్యాడులు పంపిణీ చేసిన సీఐ

విద్యార్థులకు పరీక్ష ప్యాడులు పంపిణీ చేసిన సీఐ

MDCL: విద్యార్థులు పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా రాయాలని అల్వాల్ సీఐ ప్రశాంత్ తెలిపారు. గురువారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి ఓల్డ్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ 10వ తరగతి విద్యార్థినులకు పరీక్షల కోసం ఉపయోగించే ప్యాడులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.