మామిడిపల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

మామిడిపల్లిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సుంకే శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం నేటితో 29వ వారానికి చేరుకుందన్నారు. చెత్తాచెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ప్రజలకు వివరించారు. స్వచ్ఛందంగా శ్రమదానం చేసిన వారిని అభినందించారు.