నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KDP: కొండాపురం, పొట్టిపాడు, బురుజుపల్లె, యనమల చింతల, కోడూరు సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వీరారెడ్డి తెలిపారు. మెయింటెనెన్స్ పనుల కారణంగా 33 KV, 11 కేవీ ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిపివేస్తామని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.