ఆస్కార్‌ చిత్రానికి భారత్‌లో బ్రేక్

ఆస్కార్‌ చిత్రానికి భారత్‌లో బ్రేక్

ఆస్కార్‌కు నామినేట్‌ అయిన ‘ది వాయిస్‌ ఆఫ్‌ హింద్‌ రజాబ్‌’ చిత్రాన్ని భారత సెన్సార్‌ బోర్డ్‌(CBFC) అడ్డుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం వేళ.. ఈ సినిమా భారత్‌-ఇజ్రాయెల్‌ దౌత్య సంబంధాలను దెబ్బతీసేలా ఉందని బోర్డు అభిప్రాయపడింది. అందుకే దీని విడుదలకు అనుమతి నిరాకరించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది.