UPDATE: గల్లంతయిన మహిళ మృతదేహం లభ్యం

UPDATE: గల్లంతయిన మహిళ మృతదేహం లభ్యం

ELR: జీలుగుమిల్లి మండలం, పూచికపాడుకి చెందిన ఇద్దరు మహిళలు శనివారం అశ్వరావుపేట మండలం, కావడి కొండ వాగు దాటుతుండగా వరదలో కొట్టుకుపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ పోలీసులు, పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు సమక్షంలో అధికారులు గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం చెల్లెమ్మ అనే మహిళ మృతదేహం లభ్యం కాగా మరొక మహిళ ఆచూకీ లభ్యం కావలసి ఉంది.