VIDEO: ప్రచారంలో నృత్యం చేసిన ఎమ్మెల్యే
BDK: టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స్థానిక సర్పంచ్ అభ్యర్థి రజిత బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం కార్యకర్తలలో జోష్ నింపడం కోసం నృత్యం చేసి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.