'బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్'

'బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్'

ASR: గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. జగన్ రద్దు చేసిన తవ్వకాలను కార్పొరేట్ల కోసం చంద్రబాబు మళ్లీ తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. గిరిజన సంక్షేమాన్ని గాలికొదిలి, సంపదను దోచుకుంటే వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.