సింగూరు రిజర్వాయర్‌కు పొంచి ఉన్న ప్రమాదం
MDK: సింగూరు రిజర్వాయర్‌కు ప్రమాదం పొంచి ఉంది. మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సాగునీటిని, హైదరాబాద్‌కు తాగునీటిని అందించే డ్యామ్ పిట్టా గోడలో పగుళ్లు ఏర్పడి, ఎగువన ఉన్న రివిట్‌మెంట్ దెబ్బతినడంతో ఏక్షణంలోనైనా కట్టతెగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరమ్మతులు జరగకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.