చాపరాయి రెండు రోజుల ఆదాయం ఎంతంటే..?
ASR: డుంబ్రిగూడ మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతంలో శని, ఆదివారాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. రెండు రోజులపాటు భారీ సంఖ్యలో పర్యాటకులు జలపాతాన్ని సందర్శించారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 5,698 మంది పర్యాటకులు చాపరాయిని సందర్శించగా, ప్రవేశ రుసుముల రూపంలో రూ.2,74,320 ఆదాయం వచ్చినట్లు ఇంఛార్జ్ అప్పారావు తెలిపారు.