'ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య'
SRPT: మునగాల మండలం జగన్నాథపురం ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం 'బడిబాట' కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. బడిలో చేరి ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహకాలను, నాణ్యమైన విద్య, ఉచిత దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.సతీష్ కుమార్, వీ. భరత్ బాబు, డీ. విజయ విద్యార్థులు పాల్గొన్నారు.