పిడుగుపాటుకు ఓ ఇల్లు ధ్వంసం

BDK: సుజాతనగర్ మండలం రాఘవపురంలో బుధవారం మధ్యాహ్నం పిడుగు పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. కురిసిన వర్షానికి పిడుగు పడి ఓ ఇల్లు కూలిపోయిందని తెలిపారు. రాఘవపురం గ్రామానికి చెందిన తెల్లబోయిన శీను ఇల్లు అని తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.