VIDEO: 'నిందితులను కఠినంగా శిక్షించాలి'
HNK: కాజీపేట మండలం కడిపికొండలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని సునందపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఘటనలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. తాజాగా ఘటనపై బాధితురాలి తండ్రి కుమారస్వామి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. కూతురిపై దాడి చేసిన దుండగులను వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు.