పులిగుండుకు మేఘాల గొడుగు

పులిగుండుకు మేఘాల గొడుగు

చిత్తూరు జిల్లాలో పులిగుండు ప్రముఖ పర్యాటక కేంద్రం. పెనుమూరుకు సమీపంలో రెండు ఎత్తైన కొండలు పక్కపక్కనే ఇలా ఉంటాయి. చాలా ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ పెద్ద కొండలపై నుంచి చూస్తే ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది. ఇటీవల వర్షాలతో ఈ పరిసరాలు మరింత ఆకర్షణీయంగా మారాయి. పులిగుండుకు మేఘాలే గొడుగులా మారినట్లు కనిపించింది.