కోబ్బరి నీళ్ల నాణ్యతపై ఆకస్మిక తనిఖీలు

VZM: జిల్లా ఆహార భద్రతా అధికారి నాగుల్ మీరా గురువారం పట్టణంలో ఒక మెడికల్ షాపులో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్ల నాణ్యతపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఆహార నియంత్రణ అధికారిణి ఎస్. ఈశ్వరి ఆదేశాలతో జరిగిన తనిఖీల్లో కొన్ని లోపాలను గుర్తించి, నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు. మిగిలిన దుకాణాల్లో కూడా అదే బ్యాచ్ ప్యాకెట్లను తనిఖీ చేశామన్నారు.