VIDEO: బోడుప్పల్లో గంజాయి బ్యాచ్ హల్చల్
HYD: బోడుప్పల్ కమాన్ వద్ద రాత్రి గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. రోడ్డు మీద వెళ్లే వారిని అడ్డుకుని బెదిరింపులకు పాల్పడుతూ గొడవలకు దిగుతూ గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికి, వారిని చూసి భయపడకుండా దురుసుగా ప్రవర్తిస్తూ తిరుగుబాటు చేశారు. నగరంలో ఇలాంటి వారి అల్లర్లను అరికట్టాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.