VIDEO: బిర్యానీ తయారీ.. చేతులతో కాదు, కాళ్లతో..!!
గుంటూరు జీటీ రోడ్డులోని ఓ హోటల్‌లో బిర్యానీ తయారీలో ఉపయోగించే దినుసులను అపరిశుభ్రంగా కాళ్ళ కింద తొక్కుతూ శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై బిర్యానీ ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ హోటళ్ల తీరు మారడం లేదని నేటిజెన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.