పిల్లలతో లిఫ్ట్ ఎక్కుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!
మహారాష్ట్రలోని పూణెలో దిఘి ప్రాంతంలో ఓ చిన్నారికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ హౌసింగ్ సొసైటీలోని లిఫ్ట్‌లో అనుకోకుండా ఆ చిన్నారి చేయి లిఫ్ట్ గేటు మధ్యలో ఇరుక్కుపోయింది. ఇది గమనించిన తల్లి, ఇతర నివాసితులు చేతిని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయతించారు. లిఫ్టులు వాడే సమయంలో, ముఖ్యంగా పసిపిల్లలు వెంట ఉన్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.