అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతల వినతి

అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతల వినతి

ATP: గుంతకల్లు వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. యువజన విభాగం పట్టణ అధ్యక్షులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. సత్య సాయి జిల్లా హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణుల దాడి చాలా దారుణం అన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.