HYD అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
HYD: పాఠశాల బస్సులు, ఇతర వాహనాలకు తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని, ఆర్టీసీ డ్రైవర్లు, లారీలు, సరుకు రవాణా డ్రైవర్లకు కంటి పరీక్షలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రహదారులపై గుంతలు, ప్రమాద స్థలాల వివరాలు వాట్సాప్ ద్వారా సేకరించి వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు. ORR సర్వీస్ రోడ్లపై చెత్త,నిర్మాణ వ్యర్థాలు వేస్తే జరిమానా విధించాలన్నారు.