సోమందేపల్లిలో సీసీ రోడ్డుకు భూమి పూజ

సోమందేపల్లిలో సీసీ రోడ్డుకు భూమి పూజ

సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలోని సప్తగిరి కాలనీలో సీసీ రోడ్డుకు టీడీపీ నాయకులు గురువారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ వెంకటేశులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.12 లక్షలు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. త్వరలో రోడ్డు వేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.