రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి
ELR: గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, వంతెనల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో నూతనంగా నిర్మించిన వంతెనను బుధవారం ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.