ఈనెల 19న మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్

KRNL: ఈనెల 19న ఆదోని మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బుధవారం మున్సిపల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వైసీపీ కౌన్సిలర్లు బోయ శాంతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ఎన్నికల సంఘం ఆమెను తొలగించింది. ఈ మేరకు ఇంఛార్జ్ ఛైర్మన్‌గా మహామ్మద్ గౌస్‌ను తాత్కాలికంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.