ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక థియేటర్ల ప్రారంభం

BDK: పాల్వంచలోగల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు కోటి రూపాయల నిధులతో ఏర్పాటుచేసిన ఆర్థోపెడిక్, ఈఎన్‌టీ, డెంటల్, కంటి, ఓపీడీ, ఆపరేషన్లకు చెందిన ఆధునిక థియేటర్లను ఎమ్మెల్యే కే. సాంబశివరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించాలన్నారు.