VIDEO: కార్తీక పౌర్ణమి వేడుకలు
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఐదవ శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాల్లో కార్తీక పౌర్ణమి కావడంతో బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే, భక్తులు టికెట్లు కొనుగోలు చేసి క్యూలో ఉన్నా, వీఐపీల పేరుతో దొడ్డిదారిన కొంతమందిని లోపలికి పంపి అభిషేకాలు చేయిస్తున్నారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.