అర్థంతరంగా నిలిచిన రైతు బజార్‌ నిర్మాణ పనులు

అర్థంతరంగా నిలిచిన రైతు బజార్‌ నిర్మాణ పనులు

ప్రకాశం: దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో గల రైతు బజార్‌ నిర్మాణ పనులు అర్థంతరంగా నిలిచిపోయాయి. రూ.80 లక్షల మార్కెట్‌ యార్డు నిధులతో రైతు బజార్‌ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ, అవి పూర్తికాకపోవడంతో దర్శి పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, నాయకులు స్పందించి రైతు బజార్‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పలువురు పేర్కొంటున్నారు.