'నేడు కలెక్టరేట్‌లో P4 వార్షికోత్సవం'
PLD: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన P4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ కలెక్టరేట్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో గడిచిన ఏడాది కాలపు ప్రగతిని వివరించనున్నట్లు పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం రూపొందించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.