కలెక్టరేట్ ఎదుట సర్పంచుల నిరసన

శ్రీకాకుళం: గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉమ్మడి జిల్లాల సర్పంచులు ప్రభుత్వం తమ డిమాండులను పరిష్కారించాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, పల్లెలు శిథిలమై పోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ పాల్గొన్నారు.