ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 8,747 మంది హాజరు
AKP: ఇవాళ జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 8,873 మంది హాజరు కావలసి ఉండగా 8,747 మంది పరీక్ష రాసినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. 126 మంది పరీక్షకు గైర్హాజర్ అయినట్లు చెప్పారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించామన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.