తాగునీటి సరఫరాకు అంతరాయం

తాగునీటి సరఫరాకు అంతరాయం

VZM: బొబ్బిలి మున్సిపాలిటీ పరిదిలో కోర్టు జంక్షన్ ,అన్న క్యాంటీన్ వద్ద నిన్న చేపట్టిన ప్రధాన పైపులైన్‌ లీకులు పనులు పూర్తి కానందున ఇవాళ సాయంత్రం నుంచి తాగునీరు సరఫరా చేస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మీ తెలిపారు. శనివారం సాయంత్రం నాటికి పనులు పూర్తి అవుతాయని అప్పటి నుంచి తాగునీరు సరఫరా చేస్తామని ఈ మేరకు ప్రజలు సహకరించాలని కోరారు.