నేడు నార్నూరుకు కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని MPPSలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ భారతిపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి మోతిలాల్ సూచించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పీఓ ఖుష్బూ గుప్తా రానున్నారన్నారు. కాగా అధికారులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.