VIDEO: 'సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపించాయి'
ADB: సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపించాయని ఆ పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బత్తుల రమేష్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు పట్ల సోనాల మండల కేంద్రంలో శుక్రవారం సంబరాలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.