ఘనంగా అలయ్ బలయ్ కార్యక్రమం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో అయ్యప్ప సేవా ప్రచార సమితి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ ఇవాళ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో మొట్టమొదటిసారిగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని, ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగిద్దామని పేర్కొన్నారు.