9వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు

9వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నేత‌ృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.19,148 కోట్లను కేటాయించారు. ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సుమారు 1.30 లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.90 కోట్లను కేటాయించారు.