అమెరికాకు వేరే రూటును పరిశీలిస్తున్న ఎయిరిండియా

అమెరికాకు వేరే రూటును పరిశీలిస్తున్న ఎయిరిండియా

ఢిల్లీ నుంచి ఉత్తర అమెరికా నగరాలకు వెళ్లే విమానాలకు, ప్రత్యామ్నాయ మార్గాలను ఎయిరిండియా అన్వేషిస్తోంది. మనదేశంలోనే ఢిల్లీ నుంచి మరో నగరానికి వచ్చి.. అక్కడ నుంచి అమెరికాకు బయలుదేరే అవకాశాలనూ పరిశీలిస్తోంది. దీంతో పాకిస్తాన్ గగనతల ఆంక్షల వల్ల, అధిక దూరం ప్రయాణించేందుకు అవుతున్న వ్యయ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది.