మెదక్: నీట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

MDK: ఆదివారం జరగనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న నీట్ పరీక్ష కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్ పరీక్షకు చేసిన ఏర్పాట్లను వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పాల్గొన్నారు.