మిత్రదేశాలు కలిసి రాకపోవడంతో ట్రంప్ అసహనం
హర్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అక్కడికి యుద్ధ నౌకలను పంపేందుకు మిత్ర దేశాలతోపాటు చైనా ససేమిరా అన్నాయి. జర్మనీ, యూకే, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాల నుంచి స్పందన కరువైంది. ఆ యుద్ధంతో నాటోకు సంబంధం లేదని ఐరోపా దేశాలు తెగేసిచెప్పాయి. దీంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.