రేపు ఉచిత వైద్య శిబిరం
WGL: నెక్కొండ మండల కేంద్రంలో సోమవారం (రేపు) "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రహేలా తన్వీర్ ఇవాళ తెలిపారు. ఈ శిబిరానికి వచ్చే ప్రజలు ఆధార్ కార్డు పట్టుకుని రావాలని సూచించారు. గ్రామంలోని ప్రజలందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ తన్వీర్ సూచించారు.