లింకు రోడ్డు పనులు ప్రారంభించాలి: సీపీఎం

KMM: ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం నుంచి గోళ్ళపాడు వెళ్లే రహదారి లింకు పనులను తక్షణమే ప్రారంభించాలని సీపీఎం జిల్లా నాయకులు నండ్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లింకు రోడ్డుకు 8 నెలల క్రితం మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారని కానీ ఇప్పటివరకు రహదారి పనులు ప్రారంభించలేదన్నారు. మంత్రి చొరవ తీసుకొని పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు.