శిథిలావస్థకు చేరిన వెలుగు కార్యాలయం
VZM: బొబ్బిలి మండలంలో ఉన్న వెలుగు కార్యాలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం పెచ్చులు ఊడిపోతుండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిరోజూ ఇక్కడ సమావేశాలు నిర్వహించే పొదుపు సంఘాల సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు.