రజక కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వినతి
KDP: వేంపల్లిలో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని అఖిల భారత రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చైతన్య కుమార్ సోమవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి వినతి పత్రం అందజేశారు. వేంపల్లి మండలంలో 700కు పైగా రజక కుటుంబాలు నివసిస్తున్నాయని, వారి సంఖ్య పెరిగినందున సామాజిక కార్యక్రమాల నిర్వహణకు కమ్యూనిటీ హాల్ అత్యవసరమని ఆయన తెలిపారు.