నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ
NGKL: పెద్దకొత్తపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO)గా వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న నాగేంద్రం పెంట్లవెల్లి మండలానికి బదిలీ అవ్వడంతో, ప్రస్తుతం ఎంపీవోగా ఉన్న వెంకటేశ్వర్లకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని స్పష్టం చేశారు.