చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

ములుగు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ... వేసవికాలంలో బాటసారిల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని, చలివేంద్రాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళా బిక్షపతి, కాంగ్రెస్ నేతలు, ప్రజలు పాల్గొన్నారు.