బస్సు డ్రైవర్‌పై దాడి.. ఖండించిన మంత్రి పొన్నం

బస్సు డ్రైవర్‌పై దాడి.. ఖండించిన మంత్రి పొన్నం

SRCL: ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగిపై దాడి చేయడం హేయమైన చర్య అని రాసుకోచ్చాడు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశించారు. ఆర్టీసీ సోదరులపై దాడులను ఉపేక్షించమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.