పర్యావరణానికి నష్టం కలుగుతోంది: ఏఈఓ
MNCL: రైతులు పొలాల్లో వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణానికి నష్టం కలుగుతుందని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాలలో వరి కోతలు పూర్తి కావచ్చాయని తెలిపారు. అయితే కొంతమంది రైతులు తెలియక వరి కొయ్యలను పొలాల్లో కాల్చి వేస్తున్నారని, దీంతో భూసారం తగ్గి పంటల దిగుబడిపై ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.