దుర్గామాత ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపన
ఆదిలాబాద్ దుర్గానగర్‌లోని శ్రీ నవశక్తి దుర్గా మాతా మందిర్ ఆవరణలో సోమవారం విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మల్యే రాథోడ్ బాపూరావు దంపతులు పాల్గొన్నారు. కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ మొదటి రోజు కలశ స్థాపన, గణపతి పూజ, యాగశాల ప్రవేశం, విగ్రహాలకు జలాభిషేకం వంటి పూజలు నిర్వహించారు.