'అటవీశాఖ అధికారులపై దాడులు సరికాదు'

'అటవీశాఖ అధికారులపై దాడులు సరికాదు'

ASR: అటవీ శాఖ అధికారులపై దాడులు చేయడం సరికాదని అటవీశాఖ అధికారులు, సిబ్బంది సింహాచలం, కిరణ్, గోపి, బాబూరావు, సన్యాసిరావు అన్నారు. ఇటీవల శ్రీశైలం అటవీశాఖ అధికారులపై కొంతమంది దాడులు చేశారన్నారు. ఇది సరికాదన్నారు. దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దాడులను నిరసిస్తూ శుక్రవారం కొయ్యూరులో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు.