కువైట్ రిఫైనరీపై డ్రోన్ల దాడి
కువైట్‌లోని అత్యంత కీలకమైన అల్ అహ్మది రిఫైనరీపై మరోసారి డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా రిఫైనరీలోని కొన్ని యూనిట్లలో భారీగా మంటలు చెలరేగాయని కువైట్ ప్రభుత్వం ధృవీకరించింది. అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో కీలక పాత్ర పోషించే ఈ ప్రాంతంపై వరుస దాడులు జరుగుతుండటం ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.