ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారి సేవలు ఎన్నటికీ మరువలేనివి: SI
VKB: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన యోధులకు పరిగి SI మోహన్ కృష్ణ మంగళవారం నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు సేవ త్యాగానికి, నిబద్ధతకు ప్రతీక అన్నారు. కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో పోలీసులు ముందుంటారని తెలిపారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారి సేవలు ఎన్నటికీ మరువలేనివని ఎస్సై పేర్కొన్నారు.