‘యుద్ధం వేళ కాంగ్రెస్ భయం పుట్టిస్తోంది’
పశ్చిమాసియా యుద్ధం వేళ భారతీయుల్లో భయాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. అసోంలోని సిల్చార్ సభలో ఆయన మాట్లాడుతూ.. యుద్ధ ప్రభావం పౌరులపై పడకుండా ప్రభుత్వం కృషి చేస్తుంటే, విపక్షం మాత్రం జాతీయ ప్రయోజనాలను విస్మరించి ప్రజలను భయపెడుతోందని మండిపడ్డారు. దేశ అభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తుల చేతుల్లో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.